బాబుకి ఓటమి భయం, పవన్ ని గెలిపించేందుకు... దాడి కామెంట్స్

Published : Apr 12, 2019, 03:29 PM IST
బాబుకి ఓటమి భయం, పవన్ ని గెలిపించేందుకు... దాడి కామెంట్స్

సారాంశం

చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని వైసీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు.  చంద్రబాబుకి ఎంత పదవీ వ్యామోహం ఉందో శుక్రవారం జరిగిన ఎన్నికల సాక్షిగా భయటపడిందన్నారు. 

చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని వైసీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు.  చంద్రబాబుకి ఎంత పదవీ వ్యామోహం ఉందో శుక్రవారం జరిగిన ఎన్నికల సాక్షిగా భయటపడిందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టారని ఆరోపించారు.  చంద్రాబు వీధి రౌడీలా వ్యవహరించారని, అధికారం ఉందని ఎన్నికల అధికారులను దబాయించారని మండిపడ్డారు.

చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర కనబడకుండా ఆయనను హీరోగా ప్రొజెక్ట్‌ చేస్తూ రెండు సినిమాలు తీయించారని తెలిపారు. ఆ సినిమాలను కూడా ప్రజలు ఆదరించలేదన్నారు. బావ చాటు బాలయ్య ఈ సినిమాలు తీసి భంగపడ్డారని ఎద్దేవా చేశారు. 

తన వెన్నుపోటు చరిత్ర బయటపడుతుందన్న భయంతో రాంగోపాల్‌ వర్మ తీసిన సినిమా విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారన్నారు. టీడీపీ నాయకులు పచ్చ చొక్కాలతో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి అమ్మా, అయ్యా అంటూ ఓట్లు అడిగారని తెలిపారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు రిగ్గింగ్‌కు ప్రయత్నించారని ఆరోపించారు.

ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండు కుమ్మకయ్యాయని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల గెలుపు కోసం జనసేన అభ్యర్థులు ప్రయత్నించారని..పవన్ గెలిపించేందుకు టీడీపీ అభ్యర్థిగా కూడా తీవ్రంగా శ్రమించారని ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు