మేం నీ వైపు రాం, నువ్వు మా వైపు రావొద్దు.. బాబు, పవన్‌ల ‘‘డీల్’’ ఇదే: జగన్

Siva Kodati |  
Published : Apr 09, 2019, 11:43 AM ISTUpdated : Apr 09, 2019, 11:46 AM IST
మేం నీ వైపు రాం, నువ్వు మా వైపు రావొద్దు.. బాబు, పవన్‌ల ‘‘డీల్’’ ఇదే: జగన్

సారాంశం

తనపై కేసులు వేసిన ఆర్కేను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆళ్ల రామకృష్ణారెడ్డి లొంగిపోలేదన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

తనపై కేసులు వేసిన ఆర్కేను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆళ్ల రామకృష్ణారెడ్డి లొంగిపోలేదన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ప్రచారసభలో పాల్గొన్నారు.

సదావర్తి భూముల కుంభకోణం, అరటి తోటలను తగలబెట్టించింది , హాయ్‌లాండ్, సింగపూర్ కుంభకోణాలు, రిషికేశ్వరి చనిపోయింది కూడా ఇదే మంగళగిరిలోనే అని జగన్ ఎద్దేవా చేశారు. ఆర్కేకు ఓటేస్తే తన కేబినెట్‌లో మంత్రిగా ఉంటాడని జగన్ స్పష్టం చేశారు.

చంద్రబాబు పార్ట్‌నర్ ప్రచారం చేస్తున్న గాజువాక, భీమవరాలకు సీఎం గానీ ఆయన కుమారుడు కానీ ప్రచారానికి వెళ్లరని వైసీపీ అధినేత ఎద్దేవా చేశారు. మంగళగిరిలో, కుప్పంలో బాబు పార్ట్‌నర్ ప్రచారానికి రాలేదన్నారు.

ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేకప్యాకేజ్‌ ఇచ్చినందుకు అర్థరాత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారని జగన్ దుయ్యబట్టారు. కృష్ణపట్నం పోర్ట్ యాజమాన్యానికి బాబు రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు.

జగన్ ఇళ్లు ఎక్కడ అంటే తాడేపల్లిలో అని ఎవరైనా చెబుతారని, అదే చంద్రబాబు ఇళ్లు ఎక్కడంటే హైదరాబాద్ జూబ్లీహిల్స్ అని జగన్ ఎద్దేవా చేశారు. దీనిని బట్టి అద్దె ఇంట్లో ఎవరుంటున్నారో... సొంత ఇంట్లో ఎవరుంటున్నారో మీకు తెలుస్తోందన్నారు.  

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు