ఏ సీఎం చేయని పని చంద్రబాబు చేశాడు: జగన్

Published : Apr 01, 2019, 12:20 PM ISTUpdated : Apr 01, 2019, 12:23 PM IST
ఏ సీఎం చేయని పని చంద్రబాబు చేశాడు: జగన్

సారాంశం

దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని అవినీతిని చంద్రబాబునాయుడు చేశారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  ఆరోపించారు.

విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో సోమవారం నాడు నిర్వహించిన వైసీపీ ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు.2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలను,  రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని  అమలు చేయలేదని  ఆయన విమర్శించారు.

ప్రజలను మోసం చేసేందుకు ఏప్రిల్ ఫూల్  హామీలను చంద్రబాబునాయుడు ఇస్తున్నారన్నారు. ప్రతి కులానికి, ప్రతి మతానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలని  ఆయన బాబును కోరారు.

మళ్లీ ప్రజలను మోసం చేసేందుకే ఎన్నికల్లో  వాగ్దానాలు చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ ఐదేళ్లలో ప్రజలకు బాబు ఏమీ చేయలేదన్నారు.డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలను బాబు ఎత్తేశాడని ఆయన విమర్శించారు. ప్రతి జిల్లాకు  ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు.

ఈ పది రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తోందని  ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుతో పాటు ఆయనకు మద్దతుగా నిలిచిన ప్రసార సాధనాల పట్ల కూడ అప్రమత్తంగా ఉండాలని  ఆయన ప్రజలను కోరారు.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు