జగన్ తో విభేదాలు నిజమే, గతంలో చిరుతో కూడా: జీవిత రాజశేఖర్

By Nagaraju penumalaFirst Published Apr 1, 2019, 12:00 PM IST
Highlights

వైఎస్ జగన్‌తో తొలుత మనస్పర్థలు వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. వాటిని ముగింపు పలికినట్లు తెలిపారు. తాము దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా ఉండేవాళ్లమని ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ పార్టీలో చేరడంతో తిరిగి సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు. 

హైదరాబాద్: సినీనటి జీవీత రాజశేఖర్ దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదేళ్లుగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు చూస్తున్నామని ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ చూసి తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

వైఎస్ జగన్‌తో తొలుత మనస్పర్థలు వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. వాటిని ముగింపు పలికినట్లు తెలిపారు. తాము దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా ఉండేవాళ్లమని ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ పార్టీలో చేరడంతో తిరిగి సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు. 

గతంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, లక్ష్మీపార్వతితో కూడా పొరపచ్చాలు వచ్చాయని అవన్నీ ఇప్పుడు సర్దుకున్నాయని తెలిపారు. చిరంజీవి తాము అనేక పార్టీలలో కలుసుకుంటున్నామని అంతా ఒక్కటయ్యామన్నారు. 

ఇప్పుడు జగన్ తో కూడా కలిసినట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ జగన్ సీఎం కావాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు తాను గతంలో బీజేపీలో చేరినమాట  వాస్తవమేనని జీవిత స్పష్టం చేశారు. 

గత మూడేళ్లుగా బీజేపీలో ఉన్నామని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కాస్త బాధించిందన్నారు జీవిత. ప్రధాని నరేంద్రమోదీ అద్భుతమైన పాలన అందిస్తున్నారని ఆయన గుడ్ ప్రైమినిస్టర్ అంటూ కితాబిచ్చారు. అయితే ఎందువల్ల ప్రత్యేక హోదా మీద శ్రద్ధ చూపలేకపోయారని విమర్శించారు. మోదీ నాయకత్వంపై తనకు విశ్వాసం ఉందన్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీలో చేరిన యాంకర్ శ్యామల దంపతులు

వైసీపీలో చేరిన సినీనటుడు రాజశేఖర్, జీవిత

click me!