టీడీపీకి షాక్: వైసీపీలో చేరిన డేవిడ్ రాజు

Published : Mar 26, 2019, 12:41 PM ISTUpdated : Mar 26, 2019, 12:43 PM IST
టీడీపీకి షాక్: వైసీపీలో చేరిన డేవిడ్ రాజు

సారాంశం

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. మంగళవారం నాడు  ఆయన వైసీపీలో చేరారు. బాపట్ల ఎంపీ స్థానం నుండి డేవిడ్ రాజు రెబెల్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు.  


ఒంగోలు: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. మంగళవారం నాడు  ఆయన వైసీపీలో చేరారు. బాపట్ల ఎంపీ స్థానం నుండి డేవిడ్ రాజు రెబెల్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు.

2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం నుండి డేవిడ్ రాజు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత  ఆయన  టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో డేవిడ్ రాజుకు టీడీపీ టిక్కెట్టు ఇవ్వలేదు..

సంతనూతలపాడు అసెంబ్లీ స్థానం నుండి డేవిడ్ రాజు టీడీపీ టిక్కెట్టు ఆశించారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు దక్కలేదు. దీంతో డేవిడ్ రాజు బాపట్ల ఎంపీ స్థానం నుండి సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు.

మంగళవారం నాడు వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో డేవిడ్ రాజు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. డేవిడ్ రాజు అభిమానులు, అనుచరులు కూడ వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు