నిజమేనా: లగడపాటి సర్వేలంటూ సోషల్ మీడియాలో వైరల్

By narsimha lodeFirst Published Mar 26, 2019, 12:29 PM IST
Highlights

ఆయా పార్టీలు, అభ్యర్థుల గెలుపు ఓటములపై సోషల్ మీడియాలో సర్వేలు విస్తృతంగా  వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.


అమరావతి:  ఆయా పార్టీలు, అభ్యర్థుల గెలుపు ఓటములపై సోషల్ మీడియాలో సర్వేలు విస్తృతంగా  వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను పురస్కరించుకొని  లగడపాటి సర్వేలు అంటూ కొన్ని పోస్టింగ్‌లు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సర్వేల్లో వైసీపీకి ఆధిక్యం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో కూడ తాను  సర్వే నిర్వహిస్తున్నామని ఈ సర్వే ఫలితాలను ఎన్నికల తర్వాత విడుదల చేస్తామని లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడ లగడపాటి ఆర్జీ ప్లాష్ టీమ్  సర్వేలు నిర్వహిస్తున్నాయి.లగడపాటి రాజగోపాల్ సర్వే పేరుతో సోషల్ మీడియాలో సోమవారం నుండి విస్తృతంగా పోస్టు చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో కూడ లగడపాటి సర్వేల పేరుతో ఇలానే సోషల్ మీడియాలో పోస్టులను చూసి ఆయన స్పందించారు. అయితే ఎన్నికలకు ముందు, పోలింగ్ రోజున లగడపాటి రాజగోపాల్ సర్వే వివరాలను వెల్లడించారు. అయితే తొలిసారిగా లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలకు భిన్నంగా ప్రజలు తెలంగాణలో తీర్పు ఇచ్చారు.అయితే లగడపాటి రాజగోపాల్ సర్వే పేరుతో నకిలీ సర్వేలను పోస్ట్ చేస్తున్నారని లగడపాటి రాజగోపాల్ సన్నిహితులు చెబుతున్నారు.
 

click me!