రెండు చోట్లా ఓటమి బాటలో పవన్..!

By telugu teamFirst Published May 23, 2019, 12:55 PM IST
Highlights

విశాఖటప్నంలోని గాజువాక నియోజకవర్గం నుంచి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే.... ఈ రెండు స్థానాల్లోనూ ఆయనకు పరాజయం తప్పలేదు.

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి... ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. సినీ నటుడుగా... లక్షల సంఖ్యలో అభిమానులను సాధించుకున్న పవన్ కళ్యాణ్... రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల సమయంలోనే  పార్టీ ఏర్పాటు చేసిన పవన్... 2019లో ఎన్నికల బరిలో నిలబడ్డారు.

విశాఖటప్నంలోని గాజువాక నియోజకవర్గం నుంచి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే.... ఈ రెండు స్థానాల్లోనూ ఆయనకు పరాజయం తప్పలేదు. జనసేన అభ్యర్థుల విజయం సంగతి పక్కన పెడితే... కనీసం పార్టీ అధినేతకు కూడా విజయం దక్కకపోవడం గమనార్హం.

సినిమాల్లో ఆయనకు అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నా... రాజకీయాల్లో మాత్రం ఆయనను పెద్దగా ఎంకరేజ్  చేయలేదు. ఆయన అభిమానులు చాలా మంది వైసీపీ, టీడీపీలకు ఓట్లు వేసినట్లు స్పష్టంగా అర్థమౌతోంది. గెలవకపోయినా... కాస్తో కూస్తో జనసేనకు ఓట్లు పడ్డాయి. ఆ ఓట్లు కూడా టీడీపీవే చీల్చారనే వాదనలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా పవన్ రాజకీయ అరంగేట్రం అట్టర్ ప్లాప్ గా మిగిలిపోయింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.

click me!