మందలగిరి మాలోకాన్ని మించిన పవన్.. విజయసాయి కౌంటర్

Published : Apr 05, 2019, 12:57 PM IST
మందలగిరి మాలోకాన్ని మించిన పవన్.. విజయసాయి కౌంటర్

సారాంశం

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు.  ప్యాకేజీకి న్యాయం చేయడానికి పవన్ గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. 

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు.  ప్యాకేజీకి న్యాయం చేయడానికి పవన్ గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. ఏ గట్టున ఉంటారో పవన్ కే తెలియదన్నారు.  ఏ రోటికాడ పాట ఆ రోటి దగ్గర పాడుతున్నారని మండిపడ్డారు. 

‘‘ఏ గట్టున ఉంటారో ఆయనకే తెలియదు. ఏ రోటికాడ ఆ పాట  పాడేస్తున్నారు పవన్. ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతారు. తెలంగాణలో పుట్టి ఉంటే  ఆంధ్రా వాళ్ళకు చుక్కలు చూపించేవాడినని ఈ గట్టున నిలబడి జబ్బులు చరుస్తారు. గందరగోళంలో మందలగిరి మాలోకాన్ని మించిపోయారు కదా!’’ అంటూ పవన్ పై సెటైర్లు వేశారు.

మరో ట్వీట్ లో ‘‘కళ్ళు మూసినా తెరిచినా చంద్రబాబుకు, పవన్‌కు జగన్‌ గారే కనిపిస్తున్నారు. ఆఫర్‌ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికై ప్రయాసపడి నటిస్తున్నారు. జగన్‌ గారిని తిట్టకపోతే ప్యాకేజీకి బాబు కోతలు పెడతారాన్న భయం కాబోలు. ముసుగులో గుద్దులాట ఎందుకు? ముసుగులు కప్పుకునేది విలన్లు, హీరోలు కాదు కదా!’’ అని అన్నారు.

‘‘ఇద్దరు సుప్రీం ప్రముఖుల సహకారంతో వేల కోట్ల శారదా చిట్ ఫండ్ స్కాంలో చిక్కిన మమతకు రక్షణ కల్పిస్తున్నది ఎవరంటే వ్యవస్థల మేనేజ్‌మెంట్‌లో సిద్ధహస్తుడైన చంద్రబాబు పేరే చెబుతున్నారు. ఎన్నికల్లో సొంత రాష్ట్రంలోనే ఎదురుగాలి వీస్తున్నా ఏపీలో దీదీ ప్రచారానికి రావడం వెనక ఉన్న మతలబు ఇదే.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు