మంగళగిరి నుంచి ఎన్నికల బరిలో తమన్నా

Siva Kodati |  
Published : Mar 25, 2019, 09:05 AM IST
మంగళగిరి నుంచి ఎన్నికల బరిలో తమన్నా

సారాంశం

ఇక్కడి నుంచి ఓ ట్రాన్స్‌జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్ ఈమేరకు ఉదయం 11.30 గంటలకు నామినేషన్ వేయనున్నారు. దీంతో నియోజకవర్గం పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపించనుంది. 

నవ్యాంధ్ర రాజధానిలోని కీలకమైన మంగళగిరి నియోజకవర్గం తాజా ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఇక్కడి నుంచి బరిలోకి దిగడంతో మంగళగిరిపై అందరి చూపు  పడింది.

ఆయన్ను ఎలాగైనా ఓడిస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఇక్కడి నుంచి ఓ ట్రాన్స్‌జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్ ఈమేరకు ఉదయం 11.30 గంటలకు నామినేషన్ వేయనున్నారు. దీంతో నియోజకవర్గం పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపించనుంది. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు