వైసీపీలోకి మరో ప్రముఖ సినీ నిర్మాత

By Nagaraju penumalaFirst Published Mar 25, 2019, 7:06 AM IST
Highlights

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చెయ్యడం సరికాదని ప్రముఖ సినీ నిర్మాత నట్టికుమార్ స్పష్టం చేశారు. పవన్ కు ఎవరు చెప్పారో తెలియదు కానీ తెలంగాణ ప్రాంతంలో  ఆంధ్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. 

హైదరాబాద్: ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చెయ్యడం సరికాదని ప్రముఖ సినీ నిర్మాత నట్టికుమార్ స్పష్టం చేశారు. పవన్ కు ఎవరు చెప్పారో తెలియదు కానీ తెలంగాణ ప్రాంతంలో  ఆంధ్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. 

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన నట్టికుమార్ గతంలో చిరంజీవి కాపులను ఓన్ చేసుకొని దెబ్బతిన్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే కులాలకు అతీతంగా ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఇచ్చారని స్పష్టం చేశారు. 

త్వరలోనే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సినీ నిర్మాత నట్టికుమార్ పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. తాను  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని అయితే ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య చీకటి ఒప్పందం నచ్చక కాంగ్రెస్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్తున్నట్లు తెలిపారు. 

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా విరుచుకుపడ్డారు. కట్టుబట్టలతో అమరావతికి వచ్చేశాము అని పదేపదే చెప్పుకుంటున్న చంద్రబాబు తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ తప్ప మిగిలిన ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటు వేయకపోతే పసుపు కుంకాలు పోతాయి అనడం సరికాదని హితవు పలికారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నీచంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 

ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఎలక్షన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. జగన్‌ ని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌, కేఏ పాల్‌లను వాడుకుంటున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాబోయేది వైఎస్‌ జగనే అని చెప్పుకొచ్చారు నిర్మాత నట్టికుమార్. 

click me!