ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు

By Nagaraju penumalaFirst Published May 27, 2019, 3:54 PM IST
Highlights

కర్నూలు జిల్లాకు చెందిన బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ముగ్గురు సొంత అన్నదమ్ములు. వీరి తండ్రి ఎల్లారెడ్డిగారి భీమారెడ్డి. ఈ ముగ్గురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల సమరంలో దిగారు. 

అమరావతి: రాజకీయాల్లో లక్ ఉంటే ఏదైనా సాధ్యమేనంటారు. అది నిజమేనని రుజువు చేశారు ఆ ముగ్గురు అన్నదమ్ములు. కర్నూలు జిల్లాకు చెందిన బాలనాగిరెడ్డి సోదరులను ఆ అదృష్ట దేవత భుజం తట్టడంతో ఆ ముగ్గరు ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. 

కర్నూలు జిల్లాకు చెందిన బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ముగ్గురు సొంత అన్నదమ్ములు. వీరి తండ్రి ఎల్లారెడ్డిగారి భీమారెడ్డి. ఈ ముగ్గురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల సమరంలో దిగారు. 

అయితే ఆ ఎన్నికల్లో ఆ ముగ్గురు అన్నదమ్ములు భారీ మెజారిటీతో గెలుపొందడం విశేషం. వై.బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా నుంచి మంత్రాలయం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇకపోతే వై.సాయిప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

ఇక మరో వ్యక్తి వై.వెంకట్రామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలుపొందారు. మెుత్తానికి ఒకే తల్లికడుపున పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అంతేకాదు ముగ్గరు కూడా గెలిచింది ఒకే పార్టీ కావడం విశేషం. 

click me!