మరో టీడీపీ నేతకు ఐటీ షాక్: రవీంద్ర ఆస్తులపై దాడులు

By narsimha lodeFirst Published Apr 4, 2019, 3:12 PM IST
Highlights

టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర  ఆస్తులపై ఐటీ అధికారులు గురువారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితమే రవీంద్ర ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
 


గుంటూరు: టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర  ఆస్తులపై ఐటీ అధికారులు గురువారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితమే రవీంద్ర ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

టీడీపీ నేత కోవెలమూరి రవీంద్ర ఆస్తులపై ఐటీ అధికారులు నెల రోజుల వ్యవధిలోనే దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కోవెలమూడి రవీంద్ర గుంటూరులో టీడీపీ నేతగా ఉన్నారు.

బుధవారం మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ సోదాలు నిర్వహించారు.అంతకుముందు నెల్లూరు, కనిగిరి అసెంబ్లీ స్థానాల నుండి  పోటీ చేస్తున్న పి. నారాయణ, ఉగ్ర నరసింహారెడ్డి ఇళ్లలో కూడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఏపీలో తమ పార్టీ అభ్యర్ధులను లక్ష్యంగా చేసుకొని ఐటీ సోదాలు నిర్వహించడంపై  ఆ పార్టీ నేతలు గురువారం నాడు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వినతి పత్రం సమర్పించారు.నామినేషన్లు సమర్పించిన తర్వాత ఐటీ దాడులు నిర్వహించడం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు
 

click me!