ఏపీలో వైసీపీదే అధికారం, 130 సీట్లలో విజయదుందుభి: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం

By Nagaraju penumalaFirst Published 20, Mar 2019, 7:42 PM IST
Highlights

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 120 నుంచి 130 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. పార్లమెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే 22 లేదా 23 స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు తలసాని శ్రీనివాస్ యాదవ్. 
 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించడం తథ్యమన్నారు తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 120 నుంచి 130 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. పార్లమెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే 22 లేదా 23 స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు తలసాని శ్రీనివాస్ యాదవ్. 

చంద్రబాబు చరిత్ర తన దగ్గర ఉందని చెప్పుకొచ్చారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయిన దొంగ చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఓడిపోతే హైదరాబాద్ లోనే ఉండాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబునాయుడును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
 
Last Updated 20, Mar 2019, 7:42 PM IST