జనసేన, కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కూడా టిడిపిదే: ఈసికి విజయసాయి రెడ్డి

By Arun Kumar PFirst Published Mar 20, 2019, 7:11 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రముఖ పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రాజకీయ విమర్శలే కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ప్రత్యర్థులను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ క్రమంలోనే వైఎస్సార్‌సిపి నాయకులు విజయసాయి రెడ్డి మరోసారి ప్రత్యర్థి తెలుగుదేశంపై, ఆ పార్టీ అధినేత  చంద్రబాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. టిడిపికి జనసేన, కాంగ్రెస్ లు అనుబంధ పార్టీలుగా మారాయని...ఈ రెండింటి తరపున కూడా తెలుగు దేశమే ఎన్నికల ఖర్చును భరిస్తోందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. 
 
'' వేర్వేరు పార్టీలుగా పోటీ చేస్తున్నా జనసేన, కాంగ్రెస్‌లు తెలుగుదేశం అనుబంధ సంస్థలే. పెట్టుబడి, డైరెక్షన్ అంతా చంద్రబాబుదే. వీరి ప్రచార వ్యయాన్ని కూడా టిడిపి ఖాతాలో కలపి లెక్కించాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరుతున్నాం. అభ్యర్థుల నామినేషన్ రుసుం నుంచి అన్ని వనరులూ చంద్రబాబు సమకూర్చేవే.'' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

మరో ట్వీట్ లో ''హత్యలు చేస్తున్నారు, వేల కోట్లు కుమ్మరిస్తున్నారు, ఓట్లు తొలగించారు, రౌడీయిజం, ఓటర్లను బెదిరించడం చేస్తున్నారు... ఎన్ని దుర్మార్గాలకు పాల్పడినా మీ ఘోర పరాజయం ఖరారై పోయింది చంద్రబాబూ. తండ్రీ కొడుకులిద్దరూ సింగపూర్ కెళ్తారో, సెంట్రల్ జైలు కెళ్తారో సిద్ధంగా ఉండండి.'' అంటూ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. 
 
''వచ్చే మూడు వారాలు అత్యంత కీలకం. చంద్రబాబు అరాచక పాలనపై అలుపెరగని పోరాటం చేసిన కార్యకర్తలు అతి విశ్వాసానికి పోకుండా శ్రమించాలి. చంద్రబాబు కట్ల పాములాంటి వాడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కసితీరా కాటేస్తాడు. పార్టీ ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్తా యోధుడిలా పోరాడాలి.'' అంటూ టిడిపి అరాచకాలను మరో మూడు వారాలు అడ్డుకోవాలని వైఎస్సార్‌సిపి శ్రేణులను విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. 
 
click me!