అసెంబ్లీ ఎన్నికలు.. రెబల్స్ పై టీడీపీ వేటు

Published : Mar 29, 2019, 04:22 PM IST
అసెంబ్లీ ఎన్నికలు.. రెబల్స్ పై టీడీపీ వేటు

సారాంశం

ఏపీలో ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఇప్పటికే అభ్యర్థుల జాబితా ఖరారు అయ్యింది. 

ఏపీలో ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఇప్పటికే అభ్యర్థుల జాబితా ఖరారు అయ్యింది. వారంతా నామినేషన్లు వేయడం కూడా జరిగింది. టికెట్ దక్కిన అభ్యర్థులంతా నామినేషన్లు వేసి.. తమ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. అయితే.. కొందరు అభ్యర్థులు టికెట్ ఆశించి భంగపడ్డారు.

కాగా.. టికెట్ ఆశించి భంగపడిన వారిలో కొందరు ఇతర పార్టీల్లోకి జంప్  గా కొందరు మాత్రం రెబల్స్ గా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే.. ఈ రెబల్స్ కారణంగా సదరు నియోకవర్గాల్లో టికెట్ చీలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రెబల్స్ పై టీడీపీ వేటు వేసింది.


పలువురు అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రంపచోడవరం-కేపీఆర్‌కే ఫణీశ్వరి, గజపతినగరం-కే శ్రీనివాసరావు, అవనిగడ్డ-కంఠమనేని రవిశంకర్‌, తంబళ్లపల్లె-మాధవరెడ్డి, విశ్వనాథరెడ్డి, మదనపల్లె-బొమ్మనచెర్వు శ్రీరాములు, బద్వేలు-విజయజ్యోతి, కడప-రాజగోపాల్‌రెడ్డి, తాడికొండ-శ్రీనివాసరావును టీడీపీ నుంచి బహిష్కరించింది.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు