వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ ఎంపీ కనకమేడల ఫైర్

Siva Kodati |  
Published : Apr 08, 2019, 12:30 PM IST
వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ ఎంపీ కనకమేడల ఫైర్

సారాంశం

అమరావతి నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారని అయితే అందులో రూ.1,000 కోట్లను గుంటూరు, విజయవాడ అండర్‌ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు కేటాయించారన్నారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన రూ.1,500 కోట్లతో ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించగలమా అని ఆయన ప్రశ్నించారు. ఎవరు సాయం చేసినా చేయకపోయినా చంద్రబాబు విజన్‌తో నిధులు సమీకరించి అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారని కనకమేడల తెలిపారు.

రాష్ట్రానికి అత్యంత కీలకమైన రాజధాని నిర్మాణం గురించి జగన్ మేనిఫెస్టోలో పెట్టకపోవడం రాజకీయ అనుభవలేమికి నిదర్శనమన్నారు. చివరికి ఇందులో రాజధానిని తరలించే కుట్ర దాగుందని కనకమేడల ఆరోపించారు.

పోలవరాన్ని గురించి కూడా వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొనలేదని.. పోలవరాన్ని నిర్మించడం కేసీఆర్‌కు ఇష్టం లేదు కాబట్టి భయపడి రాయలేదా.. లేక మీకే ఇష్టం లేదా అని జగన్‌ను కనకమేడల ప్రశ్నించారు. 
 
PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు