పుట్టా నివాసంలో ఐటీ సోదాలు: అధికారులపై సీఎం రమేష్ హల్ చల్

By Nagaraju penumalaFirst Published Apr 3, 2019, 8:08 PM IST
Highlights

ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న గదికి రేరుగా వెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థిగా నామినేసన్ వేసి ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఎందుకు రావాల్సి వచ్చిందని నిలదీశారు. ఎవరు పంపించారంటూ నిలదీశారు. అంతా వెతికారు కదా ఏం దొరికిందో మీడియాకు చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రొద్దుటూరు: ఐటీ అధికారులపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిలా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాల విషయం తెలుసుకున్న సీఎం రమేష్ పుట్టా ఇంటికి చేరుకున్నారు. 

ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న గదికి రేరుగా వెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థిగా నామినేసన్ వేసి ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఎందుకు రావాల్సి వచ్చిందని నిలదీశారు. ఎవరు పంపించారంటూ నిలదీశారు. 

అంతా వెతికారు కదా ఏం దొరికిందో మీడియాకు చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ అధికారులను కావాలనే తమ ఇళ్లపై దాడులు చేయిస్తోందని ఆయన విమర్శించారు. 

మరోవైపు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు పుట్టా నివాసానికి చేరుకున్నారు. ఐటీ అధికారుల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఐటీ దాడులు రాజకీయ కుట్రేనంటూ విమర్శించారు. 

ప్రధాని నరేంద్రమోదీ, వైఎస్ జగన్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇకపోతే ఐటీ అధికారులు పుట్టా సుధాకర్ యాదవ్ కు చెందిన నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కడప, ప్రొద్దుటూరులోని ఇళ్లల్లో దాదాపు రెండు గంటలపాటు సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు

click me!