టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీకి చిక్కులు: నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ

By Nagaraju penumalaFirst Published Apr 3, 2019, 7:31 PM IST
Highlights

హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు బుధవారం నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. వల్లభనేని వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. తనకు ప్రభుత్వ రక్షణ కల్పించడం లేదని ఆరోపిస్తూ వంశీ ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. 
 
గన్నవరం: ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏపీలో తెలుగుదేశం పార్టీకి సరికొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంపై ఐటీ దాడులు టీడీపీ శిబిరంలో గుబులు రేపుతుంటే తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారి చెయ్యడం కలకలం రేపుతోంది. 

హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు బుధవారం నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. వల్లభనేని వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. తనకు ప్రభుత్వ రక్షణ కల్పించడం లేదని ఆరోపిస్తూ వంశీ ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. 

ఈనేపథ్యంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు వంశీ హాజరుకాకపోవడంతో తాజాగా కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 

నాన్ బెయిల్ బుల్ వారెంట్ పై వల్లభనేని వంశీ స్పందించారు. ఈ కేసును 2013లోనే హైకోర్టు కొట్టివేసిందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు ప్రతిని నాంపల్లి కోర్టుకు నివేదిస్తానని వంశీ స్పష్టం చేశారు. 

click me!