నా ఇళ్లే కాదు.. మా వూరంతా సోదాలు చేస్తున్నారు: సీఎం రమేశ్

Siva Kodati |  
Published : Apr 05, 2019, 10:24 AM IST
నా ఇళ్లే కాదు.. మా వూరంతా సోదాలు చేస్తున్నారు: సీఎం రమేశ్

సారాంశం

తన ఇంటిపై పోలీసుల తనిఖీలపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ స్పందించారు. ఉదయం ఆరు గంటలకే పోలీసులు తన ఇంటికి వచ్చారని.. తనిఖీల విషయమై తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని తెలిపారు. 

తన ఇంటిపై పోలీసుల తనిఖీలపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ స్పందించారు. ఉదయం ఆరు గంటలకే పోలీసులు తన ఇంటికి వచ్చారని.. తనిఖీల విషయమై తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని తెలిపారు.

మా వూరు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటని.. దీంతో గ్రామంలోని ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీ చేస్తున్నారని సీఎం రమేశ్ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపించారు.

చంద్రబాబు సభలకు వచ్చే స్పందన చూసి భయపడి ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందని సీఎం రమేశ్ ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు