వైసీపీలోకి మాగుంట... వైవీ సుబ్బారెడ్డి స్టెప్ ఏంటీ..?

By Siva KodatiFirst Published Mar 11, 2019, 8:04 AM IST
Highlights

టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారం రాత్రి అనుచరులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారం రాత్రి అనుచరులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈసారి లోక్‌సభకు పోటీ చేయలేనని మాగుంట.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తేల్చి చెప్పారు. దీంతో హైకమాండ్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. చివరి యత్నంగా మరోమారి మాగుంటను అడిగి చూసింది.

ఇదే సమయంలో శ్రీనివాసులురెడ్డితో టచ్‌లో ఉన్న కొందరు వైసీపీ నేతలు కూడా ఏం డిసైడ్ అయ్యారని వాకబు చేయడంతో పాటు అభిమానులు, అనుచరులు సైతం ఒత్తిడి పెంచడంతో మాగుంట వైసీపీ వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.

అర్థరాత్రి సమయంలో అనుచరులతో జరిగిన కీలక భేటీలో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి.. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

అయితే మాగుంట రాకతో తన సీటుకు గండం వస్తుందని భావిస్తున్న ఆయన జగన్‌తో పాటు పార్టీ కీలక నేతలపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ టిక్కెట్టు తప్పించి మాగుంటకు ఏది ఇచ్చినా తనకు సమ్మతమే అన్న సంకేతాలు ఆయన అధిష్టానానికి పంపుతున్నారు. 

click me!