మే 23న వైసీపీ ఆఫీస్‌కు Tolet బోర్డే: జగన్‌పై బుద్ధా సెటైర్లు

By Siva KodatiFirst Published Apr 16, 2019, 2:00 PM IST
Highlights

ఎన్నికల సంఘం తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన వారికి ఈసీ వత్తాసు పలుకుతోందన్నారు.

ఎన్నికల సంఘం తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన వారికి ఈసీ వత్తాసు పలుకుతోందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ప్రశాంతంగా సాగడానికి కేంద్రం ప్రత్యేక భద్రతా దళాలను ఎందుకు పంపించలేదని బుద్ధా ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి ఈసీని కలిసొచ్చి చేసిన వ్యాఖ్యలు... దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ఇక్కడ జరిగిన అన్యాయం ఇతర రాష్ట్రాల్లో జరగకూడదనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కలిశారన్నారు. దీనికి తాము ఎన్నికల్లో ఓడిపోతున్నామని, భయపడుతున్నామని వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని వెంకన్న మండిపడ్డారు.

12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయితో పాటు వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో పేరున్న బొత్స సత్యనారాయణకు ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ ఇస్తుందా..? అని బుద్దా ప్రశ్నించారు. చెత్తలో దొరికిన వీవీ‌ప్యాట్‌ల విషయంపై ఈసీ సమాధానం ఏం చెబుతుందన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో విజయసాయిరెడ్డికి రాచ మర్యాదలు చేశారని, ఆయన బయటకు వచ్చి మేము అడిగిన అధికారులను బదిలీ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారని వెంకన్న ఫైరయ్యారు.

ఈసీకి, వైసీపీని జత చేసింది బీజేపీయేనని ఆయన ఆరోపించారు. వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చంద్రబాబు ప్రచారం చేస్తారని బుద్ధా స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ సునామీ సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఫలితాలు రాకముందే జగన్ ముఖ్యమంత్రి అయినట్లు ఏకంగా నేమ్ ప్లేట్ చేయించుకన్నారని విమర్శించారు. మే 23 తరువాత వైసీపీ ఆఫీస్‌కు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డ్ తగిలిస్తారని బుద్దా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 

click me!