సీఎం జగన్ అంటూ నేమ్ ప్లేట్... ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Published : Apr 16, 2019, 10:04 AM IST
సీఎం జగన్ అంటూ నేమ్ ప్లేట్... ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

సారాంశం

వైసీపీ అధినేత జగన్ సీఎం అవ్వాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీఎం అవ్వడం ఆయన కల అన్న విషయం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే. 

వైసీపీ అధినేత జగన్ సీఎం అవ్వాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీఎం అవ్వడం ఆయన కల అన్న విషయం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే. కాగా... ఇటీవల ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఫలితాలు మాత్రం మే 23న విడుదల కానున్నాయి.

 అయితే.. ఈ ఎన్నికల్లో గెలుపుపై జగన్ ధీమాగా ఉన్నారు.  ఈ క్రమంలోనే ఆయన సన్నిహితులు ఆయన ముఖ్యమంత్రి అయినట్టు నేమ్ ప్లేట్ కూడా తయారు చేయించారు. ఆ నేమ్ ప్లేట్ ఫోటోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా..ఈ నేమ్ ప్లేట్ పై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇంకా ఫలితాలు రాలేదు కాబట్టి సింబాలిక్‌గా సగం మాత్రమే చూపిస్తూ మిగతా సగం ఫలితాల తర్వాత అన్నట్లుగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వదిలారు. ఇలా ఆ ఫోటో బయటకు వచ్చిందో లేదో.. అలా వైరల్ అయిపోయింది. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్నవాళ్లకన్నా.. ట్రోల్ చేసినవాళ్లే ఎక్కువ. ఆత్రం ఆగడంలేదన్న కామెంట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు