అమ్మ చెల్లితో కలిసి ఓట్లు అడుక్కుంటున్న మిస్టర్ 420 జగన్ : బుద్దా వెంకన్న

Published : Apr 02, 2019, 07:38 PM IST
అమ్మ చెల్లితో కలిసి ఓట్లు అడుక్కుంటున్న మిస్టర్ 420 జగన్ : బుద్దా వెంకన్న

సారాంశం

రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ భరతం పడతామని తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న జగన్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్తూ వారం రోజులపాటు రోజుకో లేఖ విడుదల చేస్తామని ప్రకటించారు. తనపై 420 కేసులు 26 ఉన్నాయని అఫిడవిట్‌లో జగన్ వెల్లడించారని స్పష్టం చేశారు. 

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మిస్టర్ 420 అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ భరతం పడతామని తెలిపారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న జగన్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్తూ వారం రోజులపాటు రోజుకో లేఖ విడుదల చేస్తామని ప్రకటించారు. తనపై 420 కేసులు 26 ఉన్నాయని అఫిడవిట్‌లో జగన్ వెల్లడించారని స్పష్టం చేశారు. 

పెద్దలను ఎలా గౌరవించాలో తెలియని జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలా? అని ప్రశ్నించారు. ఒక్క అవకాశం అంటూ తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలతో కలిసి అడ్డుక్కుంటున్నాడని ధ్వజమెత్తారు. 

నేరాలు ఎలా చేయాలో చెప్పేందుకు జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలా? అని నిలదీశారు. ప్రధాని నరేంద్రమోదీ ఒక సైకో అయితే జగన్ ఓ కేడీ అని విరుచుకుపడ్డారు. ఇద్దరూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు బుద్దా వెంకన్న

ఈ వార్తలు కూడా చదవండి

కొడాలి నానికి ఆ స్థాయి లేదు.. బుద్ధా వెంకన్న

మోహన్ బాబుపై బుద్ధా కామెంట్స్.. మండిపడ్డ దాసరి ఫ్యామిలీ

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు