ప్రశాంత్ కిశోర్ పై ఆగ్రహం: ఈసీకి టీడీపి నేతల ఫిర్యాదు

By telugu teamFirst Published Apr 8, 2019, 7:57 AM IST
Highlights

వైసీపీకి ఓటేస్తే పేటీఎం వ్యాలెట్‌లో రూ.1500 జమ చేస్తామంటూ పీకే ఆయన బృందంలోని విజేందర్‌, రాములు సోషల్‌ మీడియాలో ఎరవేస్తున్నారని, తద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు వివరించారు. 

అమరావతి: సోషల్‌ మీడియాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ ఉల్లంఘిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆయనపై ఆర్టీసీ చైర్మన్‌, టీడీపీ నేత వర్ల రామయ్య సీఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. 

వైసీపీకి ఓటేస్తే పేటీఎం వ్యాలెట్‌లో రూ.1500 జమ చేస్తామంటూ పీకే ఆయన బృందంలోని విజేందర్‌, రాములు సోషల్‌ మీడియాలో ఎరవేస్తున్నారని, తద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు వివరించారు. 

జగన్‌ కు చెందిన సాక్షి దిన పత్రిక, సాక్షి టీవీ చానెల్‌లో ఓటర్లను ప్రభావితం చేసేలా, టీడీపీపై నిరాధార ఆరోపణలతో ప్రసారం చేస్తున్న కథనాలపై ఇది వరకు చాలా సార్లు ఫిర్యాదు చేశామని, అయినా ఏ విధమైన చర్యలు తీసుకోలేదని వారన్నారు.

click me!