టీడీపీకి షాక్.. వైసీపీలోకి దాసరి బాలవర్థన్

Published : Mar 08, 2019, 11:15 AM IST
టీడీపీకి షాక్.. వైసీపీలోకి దాసరి బాలవర్థన్

సారాంశం

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. టీడీపీకి మరో షాక్ తగిలింది.  గన్నవరం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి  మరో దెబ్బ తగిలింది. 

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. టీడీపీకి మరో షాక్ తగిలింది.  గన్నవరం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి  మరో దెబ్బ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా విజయ డెయిరీ డైరెక్టర్ దాసరి వెంకట బాలవర్థన్ రావు శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. 

ఆ వెంటనే.. వైసీపీ అధినేత జగన్ ని కలిసి.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ స్వయంగా బాలవర్థన్ రావుకు కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, బాలవర్థన్‌ రావు సోదరుడు దాసరి జై రమేష్‌ పాల‍్గొన్నారు. కాగా ఇప్పటికే దాసరి జై రమేష్‌...వైఎస్సార్ సీపీలో చేరిన విషయం విదితమే. 

ఈ సందర్భంగా దాసరి బాలవర్ధన్‌ రావు మాట్లాడుతూ... గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని అన్నారు. గన్నవరంలో ప్రజల కష్టసుఖాలు చెప్పుకునే పరిస్థితి టీడీపీలో లేదని అన్నారు. కార్యకర్తల భవిష్యత్‌ కోసం తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు. అయితే తాను ఎలాంటి హామీలు అడగలేదని దాసరి బాలవర్ధన్‌ రావు పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేందుకు తాను సిద్ధమన్నారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు