ఎట్టకేలకు తాడేపల్లిగూడెం టీడీపి అభ్యర్థి ఖరారు: బాపిరాజుకు బాబు బుజ్జగింపులు

Published : Mar 08, 2019, 07:58 AM IST
ఎట్టకేలకు తాడేపల్లిగూడెం టీడీపి అభ్యర్థి ఖరారు: బాపిరాజుకు బాబు బుజ్జగింపులు

సారాంశం

తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈలి నాని పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.

అమరావతి: తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈలి నాని పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. చివరి వరకు బాపిరాజు పేరును చంద్రబాబు పరిశీలించారు. అయితే కుల సమీకరణాల కారణంగా ఈలి నాని వైపే మొగ్గు చూపారు. 

బాపిరాజును చంద్రబాబు బుజ్జగించారు. సమీకరణాల వల్ల టిక్కెట్ ఇవ్వలేకపోయానని బాపిరాజుకు ఆయన చెప్పారు. తాడేపల్లిగూడెం స్థానాన్ని గెలిపించే బాధ్యత బాపిరాజుకు అప్పగించారు. 

ఈలి నాని గెలిపించాల్సిన బాధ్యత మీదేనంటూ బాపిరాజుకు చెప్పారు.. భవిష్యత్తులో బాపిరాజుకు అన్ని రకాలుగా ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు