హిందూపురంలో బాలయ్యకు షాకిచ్చిన మహిళలు...

By Arun Kumar PFirst Published Apr 4, 2019, 9:09 PM IST
Highlights

సీనినటులు,  సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి హిందూపురం అసెంబ్లీ స్ధానానికి టిడిపి అభ్యర్థిగా ఫోటీకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకర్గ పరిధిలో ప్రచారంలో పాల్గొన్న ఆయనకు గురువారం ఛేదు అనుభవం ఎదురయ్యింది. తాగు నీటి సమస్యతో బాధపడుతున్న గ్రామస్థులు ఖాళీ బిందెలతో బాలయ్య ప్రచారాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. 

అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని చిలమత్తూరు మండల పరిధిలోని గ్రామాల్లో బాలకృష్ణ ఇవాళ ప్రచారం నిర్వహించారు. టిడిపి పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో తిరుగుతూ రోడ్ షో నిర్వహిస్తూ అక్కడక్కడ బాలకృష్ణ ప్రసంగించారు. ఈ క్రమంలో దేమకేతెపల్లి గ్రామంలోకి ప్రవేశించిన టిడిపి ప్రచార వాహనాలను కొందరు మహిళలు అడ్డుకున్నారు. 

ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు తమ నీటి సమస్యలపై బాలకృష్ణ ఎదుటే నిరసనకు దిగారు. ఖాళీ బిందెలతో అడ్డుగా నిలిచిన మహిళలను స్థానిక నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తమ సమస్యపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదలబోమని చెబుతూ నిరసనను కొనసాగించారరు. తాగునీటి సమస్య పరిష్కరించకుండా ఓట్లు అడగడానికి ఎందుకొచ్చారని మహిళలు గట్టిగా నిలదీశారు.

అయితే ఇలా నిరసనకు దిగిన మహిళలను స్వయంగా బాలయ్య సముదాయించే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు ఈ నీటి సమస్య గురించి తన దృష్టికి రాలేదని...ఎన్నికల తర్వాత తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. అలాగే ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను తన దృష్టికి తీసుకురావాలని వారి ఎదుటే స్థానిక నాయకులకు బాలకృష్ణ సూచించారు. 
 
click me!