చింతమనేని ప్రభాకర్ ఓటమి: వైసీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరి గెలుపు

Published : May 23, 2019, 05:28 PM IST
చింతమనేని ప్రభాకర్ ఓటమి: వైసీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరి గెలుపు

సారాంశం

వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని తొడగొట్టిన చింతమనేని ప్రభాకర్ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో పరాజయం పాలయ్యారు. 

దెందులూరు: వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని తొడగొట్టిన చింతమనేని ప్రభాకర్ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో పరాజయం పాలయ్యారు. 

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే తనపై పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు చింతమనేని ప్రభాకర్. అంతేకాదు ప్రజాపోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ను సైతం తనపై పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. 

ఇలా వివాదాస్పద సవాల్ విసురుతూ నానా హంగామా చేస్తూ నిత్యం వార్తల్లో ఉండటం పరిపాటిగా మారింది చింతమనేని ప్రభాకర్. 2009లో దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఆయన 2014 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 

మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధిందామనుకున్న సమయంలో ఆయన ఆశలను ఆడియాశలు చేశారు ఓటర్లు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చేతులో ఘోరంగా ఓటమి పాలయ్యారు.   

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు