పవన్ కళ్యాణ్ కు ఘోర పరాభవం: పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి

By Nagaraju penumalaFirst Published May 23, 2019, 5:11 PM IST
Highlights

అయితే తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. పవన్ కళ్యాణ్ పై 3,938 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. ఇకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాకలో సైతం వెనుకంజలో ఉన్నారు. 

అమరావతి: 2019 ఎన్నికలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఘోరంగా ఓటమి చవి చూశారు. పవన్ కళ్యాణ్ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. 

అయితే తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. పవన్ కళ్యాణ్ పై 3,938 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. ఇకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాకలో సైతం వెనుకంజలో ఉన్నారు 

ఇకపోతే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లా  గాజువాక నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ కూడా ఆయన ఓటమి పాలయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో ఆయన ఘోరంగా ఓటమి పాలయ్యారు.

మెుత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారు. ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాపాక వరప్రసాద్ గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. 

click me!