అనంతలో రోడ్డు ప్రమాదం: తహసీల్దార్ దుర్మరణం

Siva Kodati |  
Published : Apr 14, 2019, 10:01 AM IST
అనంతలో రోడ్డు ప్రమాదం: తహసీల్దార్ దుర్మరణం

సారాంశం

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం పరిధిలోని గుడ్డాలపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా బనగానపల్లి తహసీల్దార్ విష్ణువర్థన్ రెడ్డి మరణించారు

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం పరిధిలోని గుడ్డాలపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా బనగానపల్లి తహసీల్దార్ విష్ణువర్థన్ రెడ్డి మరణించారు.

గుత్తి నుంచి ఆనంతపురం వైపు విష్ణువర్థన్ రెడ్డి కారులో వస్తున్నారు.. ఈ క్రమంలో గుడ్డాలపల్లి వద్ద ఒక్కసారిగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తోటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు