వైసీపీలోకి కీలక నేత: సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్

By Nagaraju penumalaFirst Published Mar 11, 2019, 3:38 PM IST
Highlights

శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన ఏపీ ఐఐసీ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధిగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

రాజమహేంద్రవరం: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు జోరందుకున్నాయి. వలసలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాంచి ఊపుమీద ఉంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ వైసీపీలో వలసల పర్వం కొనసాగుతుంది. 

తూర్పుగోదావరి జిల్లాలో కీలకనేత అయిన మాజీ ఏపీఐఐసీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడలో సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం చేరుకున్న వైఎస్ జగన్ ను కలిశారు శ్రీఘాకోళపు. 

అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇకపోతే శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 

కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన ఏపీ ఐఐసీ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధిగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ లో వైసీపీ గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతుంది. 

 

click me!