బాబు తప్పించుకోలేడు: వైసీపీలో చేరిన మంత్రి దేవినేని ఉమ సోదరుడు

Siva Kodati |  
Published : Mar 11, 2019, 10:45 AM ISTUpdated : Mar 11, 2019, 10:48 AM IST
బాబు తప్పించుకోలేడు: వైసీపీలో చేరిన మంత్రి దేవినేని ఉమ సోదరుడు

సారాంశం

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోదరుడు చంద్రశేఖర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోదరుడు చంద్రశేఖర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఉదయం మైలవరం వైసీపీ ఇన్‌ఛార్జ్ వసంత కృష్ణప్రసాద్ వెంట లోటస్‌పాండ్‌కు ‌చేరుకున్నారు. అనంతరం జగన్‌‌తో ప్రత్యేకం భేటీ అయి ఆయన సమక్షంలో చంద్రశేఖర్ వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనేక కారణాల వల్ల పార్టీ మారినట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికార దోపిడి ఎక్కువగా ఉందని చంద్రశేఖర్ ఆరోపించారు. పట్టిసీమ లాంటి ప్రాజెక్టుల్లో దోపిడీ అధికంగా ఉందని కేసుల నుంచి బయటపడలేరని ఆయన వ్యాఖ్యానించారు. 
 
PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు