టీడీపీలో చేరనున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం సీటుపై గురి

By Siva KodatiFirst Published Mar 19, 2019, 2:04 PM IST
Highlights

కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకు టీడీపీలోనే ఉన్న బైరెడ్డి పార్టీ నుంచి తప్పుకున్నారు. 

కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకు టీడీపీలోనే ఉన్న బైరెడ్డి పార్టీ నుంచి తప్పుకున్నారు.

అనంతరం రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. ఇందుకోసం ఓ పార్టీని స్ధాపించిన ఆయన... ప్రజల నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్ రెడ్డి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ స్ధానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో ఆ స్ధానం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి టీడీపీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

తాను శ్రీశైలం నుంచి బరిలోకి దిగిలే అటు అసెంబ్లీ స్థానంతో పాటు.. ఇటు లోక్‌సభ స్థానంలోనూ టీడీపీ అభ్యర్ధి గెలుపుకు లాభిస్తుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైతే రేపు లేదా ఎల్లుండి బైరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉంది.

click me!