ఆమంచికి టికెట్.. వైసీపీలో చల్లారని అసంతృప్తి

Published : Mar 19, 2019, 12:25 PM IST
ఆమంచికి టికెట్.. వైసీపీలో  చల్లారని అసంతృప్తి

సారాంశం

ఆమంచి కారణంగా..వైసీపీలో మొదలైన అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారలేదు.

ఆమంచి కారణంగా..వైసీపీలో మొదలైన అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారలేదు. ప్రకాశం జిల్లాలో ఆమంచికి చీరాల టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయనకు టికెట్ కేటాయించడం పట్ల.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

ఆమంచికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ కార్యదర్శి అమృతపాణి స్పష్టం చేశారు. తనపై సాక్షి మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ఆరోపించారు. త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
 
ఇక కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో ముసలం ఏర్పడింది. వైసీపీని వీడే యోచనలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఉన్నారు. నందికొట్కూరు టికెట్ ఆర్ధర్‌కు ఇవ్వడంతో ఐజయ్య మనస్తాపం చెందారు. టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు