మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Siva Kodati |  
Published : Apr 11, 2019, 06:31 PM IST
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 

ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. విశాఖ ఏజెన్సీలోని అరకు, పాడేరులలో ఎన్నికలు బహిష్కరించాలని మావోలు పిలుపునిచ్చారు.

దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేహౌండ్స్, పారామిలటరీ, ప్రత్యేక పోలీస్ బలగాలను రంగంలోకి దించారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించడానికి హెలికాఫ్టర్లు, డ్రోన్లను ఏర్పాటు చేశారు.

మరోవైపు ఏజెన్సీలో ఎన్నికల వేళ భారీ విధ్వంసానికి మావోలు వ్యూహరచన చేశారు. పెదబయలు మండలం చీకుపనస మద్దిగరువు సమీపంలో శక్తివంతమైన మందుపాతరలను అమర్చారు. అయితే పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించి మూడు మందుపాతరలను వెలికి తీసి వాటిని నిర్వీర్యం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు