
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య పోలింగ్ కేంద్రంలో హల్ చల్ చేయడం సంచలనం సృష్టించారు. పోలింగ్ బూత్‌కు చేరుకున్న ఆమె టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఆమె హెచ్చరికలు చేశారు.
ఏకంగా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇవ్వడం చిలకలూరిపేటలో కలకలం రేపింది. ప్రత్తిపాటి భార్య తీరుపై ఎన్నికల సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడలో వైసీపీ ఏజెంట్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు.
చేయి చేసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని సొరకాయల పాలెంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్ధితి పరిస్ధితి నెలకొంది.