మైలవరంలో డమ్మీ ఈవీఎంల కలకలం

By ramya NFirst Published Apr 3, 2019, 3:15 PM IST
Highlights

మరో వారంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో డమ్మీ ఈవీఎంలు కలకలం రేపాయి.  సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్న 2,400 డమ్మీ ఈవీఎంలను కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు తుమ్మలపాలెం చెక్ పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేత రామాంజనేయులకు చెందిన వ్యక్తులు వీటిని తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు.వెంటనే ఈ విషయాన్ని పోలీసులు ఎన్నికల నియామావళి అధికారి, ఎంపీడడీవో రామప్రసన్న దృష్టికి తీసుకువెళ్లారు.

స్వాధీనం చేసుకున్న డమ్మీ ఈవీఎంలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒక్కొక్క ఈవీఎం రూ.16కు కొనుగోలు చేసినట్లు సంబంధిత వ్యక్తులు బిల్లులు చూపించారు. అయితే ఒక ఈవీఎం ఖరీదు సుమారు రూ.100 వరకు ఉంటుందని గుర్తించిన అధికారులు 2,400 ఈవీఎంలకు రూ.2.40 లక్షలు ఖర్చును భీమవరం టీడీపీ అభ్యర్థి పి.రామాంజనేయులు ఖర్చులో జమచేసి ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించారు. 

click me!