మొదలైన కౌంటింగ్.. పాతపట్నంలో వైసీపీ ఆధిక్యం

Published : May 23, 2019, 08:21 AM IST
మొదలైన కౌంటింగ్.. పాతపట్నంలో వైసీపీ ఆధిక్యం

సారాంశం

ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. 

ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. కాగా.. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైసీపీ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో పాతపట్నం వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి వెంకట రమణ మూర్తి స్వల్ప వెనకంజలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు