ఎన్నికల సిబ్బందిపై తేనెటీగల దాడి

By telugu teamFirst Published May 23, 2019, 7:48 AM IST
Highlights

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా... ఈ ఎన్నికల కౌటింగ్ కోసం వచ్చిన కొందరు ఎన్నికల అధికారులకు చేదు అనుభవం ఎదురైంది.

విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడ లో ఎన్నికల అధికారులపై తేటెటీగలు దాడి చేశాయి. జొన్నాడలో ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా...మెయిన్ గేట్ వద్ద కిటికీలకు ఆనుకొని తేనెటీగల పట్టు ఉంది. అనుకోకుండా అది కదిలి తేనెటీగలు రేగాయి.అక్కడే ఉన్న ఎన్నికల అధికారులపై దాడులు చేశాయి. దీంతో.. అధికారులు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.

click me!