తమ్ముడి ఆఫీసులో బోయ్‌గానైనా పనిచేస్తా: నాగబాబు

Published : Mar 20, 2019, 01:07 PM ISTUpdated : Mar 20, 2019, 01:43 PM IST
తమ్ముడి ఆఫీసులో బోయ్‌గానైనా పనిచేస్తా: నాగబాబు

సారాంశం

పవన్ కళ్యాణ్‌  నా నాయకుడు.. ఆయన ఏ పని చెప్పినా  చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని సినీ నటుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ప్రకటించారు.  

అమరావతి: పవన్ కళ్యాణ్‌  నా నాయకుడు.. ఆయన ఏ పని చెప్పినా  చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని సినీ నటుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ప్రకటించారు.

బుధవారం నాడు సినీ నటుడు నాగబాబు జనసేనలో  చేరారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడారు. ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక ఉండేదన్నారు. కానీ, కొన్ని కారణాలతో సాధ్యం కాలేదన్నారు. 

పవన్ కళ్యాణ్‌ను చిన్నప్పటి నుండి అతి దగ్గరగా చూసిన వ్యక్తిని తాను అంటూ నాగబాబు తమ మధ్య ఉన్న సంబంధాన్ని నెమరువేసుకొన్నారు. చిన్నతనంలో పవన్ కళ్యాణ్ చాలా అందంగా ఉండేవాడన్నారు. పవన్‌ను తాను ఎత్తుకొని ఆడించేవాడినని ఆయన గుర్తు చేసుకొన్నారు.

చిన్నతనంలో పవన్ ఒక్కడే కూర్చొని ఆలోచించేవాడన్నారు. తాము ఏది అడిగినా సమాధానం చెప్పకపోయేవాడన్నారు. కానీ, సమాజం కోసం చిన్నతనం నుండే పవన్ ఆలోచించేవాడని ఆ తర్వాత కాలంలో తాను అర్ధం చేసుకొన్నానని నాగబాబు వివరించారు. తమ కుటుంబమంతా ఆశ్చర్యపోయేలా పవన్ ఎదిగాడని నాగబాబు పవన్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. 

పవన్ కళ్యాణ్ తనకు సోదరుడే కావొచ్చు... కానీ, పార్టీలో చేరిన తనకు పవన్ ఓ నాయకుడన్నారు. ఆపీస్‌లో క్లీన్ చేసే పని ఇచ్చినా చేసేందుకు కూడ తాను సిద్దంగా ఉన్నానని ఆయన వివరించారు.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు