పవన్ కి మరో షాక్...వైసీపీలోకి చిరు వీరాభిమాని

Published : Mar 27, 2019, 04:32 PM IST
పవన్ కి మరో షాక్...వైసీపీలోకి చిరు వీరాభిమాని

సారాంశం

ఎన్నికలు మరెంతో దూరంలోలేవు అన్న సమయంలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. 

ఎన్నికలు మరెంతో దూరంలోలేవు అన్న సమయంలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు పార్టీ వీడారు. పార్టీ నుంచి టికెట్ కేటాయించిన వారు కూడా కొందరు నామినేషన్ ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారు.  కాగా.. తాజాగా మరో నేత జనసేనను వీడారు. 

మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని, వారి కుటుంబానికి అంత్యంత సన్నిహితుడు, నిన్నటి వరకు జనసేనలో కీలకనేతగా వ్యవహరించిన ఎం.రాఘవరావు బుధవారం జనసేనను వీడారు. వైసీపీ నేత దాడి వీరభద్రరావు సమక్షంలో వైసీపీ అధినేత జగన్ రాఘవరావుకి పార్టీ కండువా కప్పి మరీ వైసీపీలోకి ఆహ్వానించారు.

పవన్ తనను గత కొంతకాలంగా అవమానిస్తూ ఉన్నారని దీంతో తాను మనస్థాపానికి గురై పార్టీ మారినట్లు ఆయన ప్రకటించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. విశాఖ జిల్లా మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ని మూలపురుషుడు కూడా ఈయనే. కాగా... ఈయన ఇప్పుడు జనసేనను వీడటం పవన్ కి పెద్ద దెబ్బేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు