జగన్ నా బంధువు, నీలా విలువలు లేని రాజకీయాలు చెయ్యరు : బాబుపై మంచు విష్ణు ఫైర్

Published : Apr 04, 2019, 09:37 AM IST
జగన్ నా బంధువు, నీలా విలువలు లేని రాజకీయాలు చెయ్యరు : బాబుపై మంచు విష్ణు ఫైర్

సారాంశం

చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంచు విష్ణు లోకేష్ ను చంద్రగిరి నుంచి కాకుండా మంగళగిరి నుంచి ఎందుకు బరిలోకి దింపారోనని నిలదీశారు. చంద్రగిరిని మీరన్నట్లు అభివృద్ధి చేస్తే ఇక్కడే పోటీకి నిలబెట్టేవారని సెటైర్లు వేశారు.

చిత్తూరు : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై హీరో మంచు విష్ణు నిప్పులు చెరిగారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను ఇక్కడ నుంచి ఎందుకు ఎన్నికల బరిలోకి దించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంచు విష్ణు లోకేష్ ను చంద్రగిరి నుంచి కాకుండా మంగళగిరి నుంచి ఎందుకు బరిలోకి దింపారోనని నిలదీశారు. 

చంద్రగిరిని మీరన్నట్లు అభివృద్ధి చేస్తే ఇక్కడే పోటీకి నిలబెట్టేవారని సెటైర్లు వేశారు.నెలకు 10 రోజులు ఇక్కడ ఉండే తమను చంద్రబాబు వలస పక్షులు అంటున్నారని, సంవత్సరానికి ఒకరోజే నారావారిపల్లెకు వచ్చే చంద్రబాబును ఏమనాలని కడిగేశారు. 

వైఎస్ జగన్ తమ బంధువు అని, విలువలతో కూడిన రాజకీయం  చెయ్యడం జగన్ కే చెల్లిందన్నారు. చంద్రబాబులా విలువలు లేని రాజకీయాలు చెయ్యరని విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు