సొంతగూటికి: వైసీపీలో చేరిన ఎస్వీమోహన్ రెడ్డి

Siva Kodati |  
Published : Mar 21, 2019, 06:48 PM IST
సొంతగూటికి: వైసీపీలో చేరిన ఎస్వీమోహన్ రెడ్డి

సారాంశం

కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. జగన్ సమక్షంలో గురువారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నుంచి వైసీపీకి రావడం సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు.

తనను టీడీపీ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బేషరతుగా వైసీపీలో చేరుతున్నట్లు ఎస్వీ తెలిపారు. కర్నూలు అసెంబ్లీలో వైసీపీని గెలిపించి తీరుతానని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా.. వైసీపీలో చేరానని వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తామే పార్టీ మారి అన్యాయం చేశామని ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు