టీడీపీలో నాలాంటి బాధితుడు మరొకరు ఉండరేమో: ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆవేదన

By Nagaraju penumalaFirst Published Mar 21, 2019, 12:56 PM IST
Highlights

టికెట్ దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ కుటుంబాన్ని ఇప్పటికే మూడుసార్లు అన్యాయం చేశారని కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. తన తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించి మెుదటి సారి అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు. 

కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో తనలాంటి బాధితుడు మరోకరు ఉండరేమో అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 

కర్నూలు అసెంబ్లీ టికెట్ చంద్రబాబు నాయుడు టీజీ భరత్ కు కేటాయించడంతో అలిగారు ఎస్వీ మోహన్ రెడ్డి. అయితే గురువారం  భవిష్యత్ కార్యచరణపై తన అనుచరులతో సమావేశమయ్యారు ఎస్వీ మోహన్ రెడ్డి. కార్యకర్తలతో తన మనోభవాలను పంచుకున్నారు. 

టికెట్ దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ కుటుంబాన్ని ఇప్పటికే మూడుసార్లు అన్యాయం చేశారని కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. తన తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించి మెుదటి సారి అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు. 

2009లో తనకు టికెట్ ఇవ్వకుండా రెండోసారి అన్యాయం చేశారని తెలిపారు. రెండు సార్లు అన్యాయం చేసినా ఇక అన్యాయం చెయ్యరన్న నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. కానీ ఈసారి తనకు టికెట్ ఇవ్వకుండా మరోసారి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బహుశా తెలుగుదేశం పార్టీలో తనలాంటి బాధితుడు మరోకరు ఉండరేమో అంటూ ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే భవిష్యత్ కార్యచరణపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పార్టీలో ఉంటారా, టీజీ భరత్ కు సహకరిస్తారా అన్న దానిపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. ఇకపోతే ఇటీవలే ఎస్వీ మోహన్ రెడ్డి సోదరుడు ఎస్వీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

టీజీ వెంకటేష్ ఎఫెక్ట్: కార్యకర్తలతో భేటీ, ఎస్వీ మోహన్ రెడ్డి ఎటు వైపు

click me!