ఈసీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ... నోరు జారిన పవన్

Siva Kodati |  
Published : Apr 11, 2019, 03:27 PM IST
ఈసీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ... నోరు జారిన పవన్

సారాంశం

రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తూనే ఉన్నాయి. దీనిపై ఎన్నికల సంఘంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ ఆ సమయంలో తడబడ్డారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు నోరు జారుతారా అని మంత్రి నారా లోకేశ్‌ ప్రసంగాన్ని మీడియాతో పాటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా గమనించేది. తాజాగా లోకేశ్ బాటలో నడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తూనే ఉన్నాయి. దీనిపై ఎన్నికల సంఘంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ ఆ సమయంలో తడబడ్డారు.

పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయని చెప్పడానికి బదులుగా ‘‘ఈఎంఐ’’లు మొరాయిస్తున్నాయని పలికారు. దీంతో పవన్ వ్యాఖ్యలను టీడీపీతో పాటు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు