ఎన్నికల ప్రచారానికి సై అంటున్న హీరో నారా రోహిత్: షెడ్యూల్ విడుదల

By Nagaraju penumalaFirst Published Apr 2, 2019, 7:57 PM IST
Highlights

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నారావారి హీరో నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు డేట్స్ సైతం ఫిక్స్ చేశాడు. ఏప్రిల్ 3 నుంచి 9వరకు అంటే దాదాపు వారం రోజులపాటు ప్రచారం చేయనున్నారు. 

అమరావతి : తెలుగుదేశం పార్టీకి మరో స్టార్ కాంపైనర్ రెడీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నారావారి హీరో నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు డేట్స్ సైతం ఫిక్స్ చేశాడు. 

ఏప్రిల్ 3 నుంచి 9వరకు అంటే దాదాపు వారం రోజులపాటు ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 3 బుధవారం రాజమహేంద్రవరం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు నారా రోహిత్. బుధవారం రాజమహేంద్రవరం ,కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 

ఏప్రిల్ 4 గురువారం పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తణుకు, గురజాల, సత్తెనపల్లి, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేస్తారు. ఏప్రిల్5న రేపల్లె, తెనాలి, పత్తిపాడులోనూ ఏప్రిల్ 6న చిలకలూరిపేట, పర్చూరు, చీరాలలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 

ఏప్రిల్ 7న ఉరవకొండ, రాయదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 8, 9న తన సొంత జిల్లా అయిన చిత్తూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది. 

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున నందమూరి హీరో తారకరత్న ఎన్నికల ప్రచారంలో దుమ్ముదులుపుతున్నారు. మరోవైపు వెంకటేష్ మేనమామ అశోక్ కుమార్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తాజాగా నారావారి హీరో రోహిత్ ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో టీడీపీలో జోష్ పెరగనుందని తెలుస్తోంది. 

click me!