ఆఖరి గంటలో పోటెత్తెన ఓటర్లు: కిక్కిరిసిన పోలింగ్ కేంద్రాలు

Siva Kodati |  
Published : Apr 11, 2019, 06:42 PM IST
ఆఖరి గంటలో పోటెత్తెన ఓటర్లు: కిక్కిరిసిన పోలింగ్ కేంద్రాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు గాను పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే చివరి గంటలో క్యూలైన్లు ఓటర్లతో కిక్కిరిసిపోయాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు గాను పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే చివరి గంటలో క్యూలైన్లు ఓటర్లతో కిక్కిరిసిపోయాయి. ఉదయం ఈవీఎంలు పనిచేయకపోవడంతో చాలా మంది ఓటర్లు ఇళ్లకు వెళ్లిపోయారు.

ఆ తర్వాత ఈవీఎంలను ఈసీ సరి చేసినప్పటికీ .. ఎండ చుక్కలు చూపించడంతో అడుగు బయటపెట్టలేకపోయారు. సాయంత్రం 5 తర్వాత ఎండ తగ్గడంతో పాటు ఓటు వేయడానికి గంట మాత్రమే సమయం ఉండటంతో ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చాలా మంది పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు.

దీంతో చివరి గంటలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదవ్వగా.. సాయంత్రం 6 గంటల నాటికి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తుండటంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు