నన్ను చంపేందుకు కుట్ర: టీడీపీపై హర్షకుమార్ సంచలన ఆరోపణలు

Published : Apr 17, 2019, 02:40 PM IST
నన్ను చంపేందుకు కుట్ర: టీడీపీపై  హర్షకుమార్ సంచలన ఆరోపణలు

సారాంశం

 తనను చంపేందుకు కుట్ర జరిగిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ బుధవారం నాడు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. 


అమలాపురం: తనను చంపేందుకు కుట్ర జరిగిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ బుధవారం నాడు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆయన ఆరోపణలు చేశారు.

బుధవారం నాడు ఆయన  ద్వివేదిని  కలిసిన తర్వాత మీడగియాతో మాట్లాడారు. ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తనను  టీడీపీ ఇబ్బందులకు గురి చేసిందని  ఆయన ఆరోపించారు. 

సామాజిక న్యాయం కోసం ఇటీవల టీడీపీలో చేరినట్టు చెప్పారు. అమలాపురం ఎంపీ సీటుతనకు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపడంతో తాను టీడీపీ నుండి బయటకు వచ్చినట్టుగా ఆయన తెలిపారు.

తనను హత్య చేసేందుకు తన కారు బోల్టులు తొలగించారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై డీజీపీకి ఫిర్యాదు చేసినా కూడ విచారణ మాత్రం జరగలేదన్నారు. ఈ విషయమై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేలా చూడాలని ఆయన ద్వివేదిని కోరానని చెప్పారు.

ఇంటర్మీడియట్ కాలేజీల్లో దోపీడీ చేస్తున్నారని హర్షకుమార్ మండిపడ్డారు. ఇంటర్ విద్యలో కార్పోరేట్ అనే పదం ఎక్కడా కూడ లేదన్నారు. ఇంటర్ పీజులపై న్యాయ పోరాటం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు