టీడీపీలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్

Published : Mar 17, 2019, 05:16 PM IST
టీడీపీలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్

సారాంశం

మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదివారం నాడు టీడీపీలో చేరారు. ఆదివారం నాడు కాకినాడలో జరిగిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.

కాకినాడ:మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదివారం నాడు టీడీపీలో చేరారు. ఆదివారం నాడు కాకినాడలో జరిగిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు హర్షకుమార్‌ మెడలో టీడీపీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నవారంతా టీడీపీలో ఉంటున్నారని చంద్రబాబునాయుడు చెప్పారు.

టీడీపీలో టిక్కెట్లు దక్కని వారంతా వైసీపీలో చేరుతున్నారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ది చేసిన విషయాన్ని బాబు వివరించారు. ఏ కారణాలతో హర్షకుమార్ టీడీపీలో చెబుతున్నారో చక్కగా వివరించారని బాబు వివరించారు.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు