యలమంచిలి రవికి జనసేన బంపర్ ఆఫర్

Published : Mar 17, 2019, 04:49 PM ISTUpdated : Mar 17, 2019, 06:59 PM IST
యలమంచిలి రవికి జనసేన బంపర్ ఆఫర్

సారాంశం

వైసీపీ టిక్కెట్టు దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు యలమంచిలి రవి  రంగం సిద్దం చేసుకొంటున్నారు

విజయవాడ: వైసీపీ టిక్కెట్టు దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు యలమంచిలి రవి  రంగం సిద్దం చేసుకొంటున్నారు. మరోవైపు జనసేనలో చేరితే విజయవాడ తూర్పు టిక్కెట్టు ఇస్తామని ఆ పార్టీ రవికి ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా రవి  స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు రవి సన్నాహలు చేసుకొంటున్న తరుణంలో వైసీపీ నాయకత్వం రవికి టిక్కెట్టు ఇవ్వలేదు. దీంతో రవి వైసీపీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండిపెండెంట్‌గా పోటికి దిగాలని భావిస్తున్నారు.

టిక్కెట్టు దక్కని రవికి జనసేన  బంపర్ ఆఫర్ ఇచ్చింది. తూర్పు నుండి జనసేన టిక్కెట్టును రవికి ఇస్తామని ప్రకటించింది. గతంలో రవి టీడీపీలో ఉండేవాడు. వంగవీటి రాధా యలమంచిలి రవిని వైసీపీలోకి తీసుకొచ్చారు.

వంగవీటి రాధా వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. అదే సమయంలో యలమంచిలి రవి వైసీపీలో ఉన్న కూడ ఆయనకు టిక్కెట్టు దక్కలేదు.

 

పసివయసులో బాక్స్ ఆఫీస్ హీరోలు.. చిన్నపుడు ఎంత ముద్దుగా ఉన్నారో

2000 - 2019: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ by year

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు